సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు ఎలా దోచుకుంటున్నారు..? ఎంత తెలివైన వ్యక్తినైనా ఈజీగా ఎలా బురిడీ కొట్టిస్తున్నారు..? వీళ్ల బారిన సామాన్యులు ఎలా పడుతున్నారో ఈ ఘటన చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వెయ్యి కాదు లక్ష కాదు.. ఒక రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఏకంగా కోటిన్నర రూపాయలు చాలా ఈజీగా కొట్టేశారు దుండగులు. అది కూడా కేంద్ర మంత్రి ఫోటోతో నమ్మించి నిండా ముంచేయటం ముంబై పోలీసులను షాకింగ్ కు గురిచేసింది. ఆర్థిక రాజధాని ముంబైలో సంచలనంగా మారిన ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు తెలసుకుందాం.
ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్ స్టా.. తదితర సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ పేరున యాడ్స్ కనిపిస్తుంటాయి కదా. షార్ట్ టైమ్ లో పెట్టిన మొత్తం డబుల్ చేస్తామని కొందరు ఆశ చూపిస్తుంటారు. కొత్త కొత్త స్కీమ్స్ పేరున అప్స్టాక్స్, జెరోధా తదితర బ్రోకింగ్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుందని చెప్తుంటారు. కొన్నిసార్లు ట్రస్టెడ్ కంపెనీల ద్వారా అయితే నష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ సైబర్ క్రిమినల్స్ కూడా ట్రస్టెడ్ కంపెనీల మాదిరిగానే యాడ్స్ ఇచ్చి దోచుకుంటున్నారు.
ముంబైలో ఒక రిటైర్డు ఉద్యోగి నుంచి రూ.కోటిన్నర కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. ఆ ఉద్యోగిని నమ్మించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను వాడుకుని చాలా తెలివిగా కోట్లు కొల్లగొట్టారు.
Facebook లో యాడ్ చూసి:
బాధితుడు ఫేస్ బుక్ లో యాడ్ చూశాడు. 21 వేల రూపాయల పెట్టుబడికి 60 వేల లాభాలు అంటూ వచ్చిన యాడ్ కు అట్రాక్ట్ అయ్యాడు. లింక్ క్లిక్ చేయగా పర్సనల్ డీటెయిల్స్ అడిగింది. పూర్తి వివరాలు ఆన్ లైన్ లో ఫిల్ చేశాడు. ఆ రత్వాత మీనాక్షి పేరుతో ఒక మహిళ వాట్సాప్ కాల్ చేసింది. అప్ స్టాక్స్ (UPSTOX) సెక్యూరిటీస్ కు చెందిన ప్రతినిధి అని చెప్పి.. ఇన్వెస్ట్ మెంట్ ప్రాసెస్ పూర్తి చేద్దామని చెప్పడంతో మనోడు ప్రొసీడ్ అయ్యాడు.
ఫేక్ కంపెనీలు, పెట్టుబడులు:
పెట్టుబడి పేరున మార్కెట్ లో లేని కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ను చూపించి డబుల్, త్రిబుల్ ప్రాఫిట్స్ ను ఆశచూపారు. అందులో ముఖ్యంగా SBI వెల్త్ మైండ్ సెట్, Savexa స్కీమ్ లలో పెట్టుబడి పెడుతున్నట్లు నమ్మించారు. అదే విధంగా రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ IPO లో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు చూపించారు. దీంతో బాధితుడు రూ.కోటి 47 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు.
రూ.6 కోట్ల లాభం.. విత్ డ్రా చేస్తే సున్నా
సైబర్ క్రిమినల్స్ చెప్పినట్లుగా ఇన్వెస్ట్ చేయగా.. బాధితునికి మొత్తం 6 కోట్ల లాభం వచ్చినట్లు డ్యాష్ బోర్డులో చూపించింది. లాభాలను విత్ డ్రా చేసుకుందామని ట్రై చేస్తే.. మరో 90 లక్షలు గ్యారెంటీ ఫీజు కింద చెల్లించాలని స్కామర్స్ డిమాండ్ చేశారు. అప్పుడు గానీ ఇదేదో స్కామ్ లా ఉందని బాధితునికి అర్థం కాలేదు.
వెంటనే నష్టపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుుని దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ కంపెనీలు, మార్పు చేసిన వెబ్ సైట్స్ లను చూపిస్తూ సైబర్ క్రిమినల్స్ సిండికేట్ గా మారి సామాన్యులను దోచుకుంటున్నారని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అందులో భాగంగానే క్రెడిబులిటీ కోసం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫోలో వాడుకుని బాధితుడిని నమ్మించి కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు తెలిపారు.
హెచ్చరించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్:
డీప్ ఫేక్, ఏఐ డ్రైవెన్ ఫ్రాడ్స్ పై ఇప్పటికే మంత్రి నిర్మలాసీతారామన్ హెచ్చరించారు. ముంబైలో 6వ గ్లోబర్ర ఫిన్ టెక్ ఫెస్ట్ 2025 సందర్భంగా మాట్లాడుతూ.. ప్రముఖుల ఫోటోలు, వాయిస్, ఫేక్ వీడియోల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఫ్రాడ్స్ కు పాల్పడుతున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇలాంటి వారి బారిన పడకుండా ఉండేందుకు ఇన్వెస్టర్ల కోసం SEBI, NPCI సంయుక్తంగా ప్రత్యేక UPI హ్యాండిల్స్ ను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
