TSPSC పేపర్ లీకేజీనా ? హానీ ట్రాపా? హ్యాకింగా : రేవంత్

TSPSC పేపర్ లీకేజీనా ? హానీ ట్రాపా? హ్యాకింగా : రేవంత్

టీఎస్ పీఎస్సీ(TSPSC) ఎగ్జామ్ పేపర్ లీక్ వెనుక  ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ లో మాట్లాడిన రేవంత్ పేపర్ లీకేజీ వ్యవహారంపై రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు.  పేపర్ లీకేజీ అసలు హనీ ట్రాపా? హ్యాకింగా? ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని  అన్నారు. పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది ఆందోళన చెందుతున్నా సీఎం కేసీఆర్ ఇంత వరకు ఎందుకు  స్పందించలేదని విమర్శించారు.  

టీఎస్ పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని  రేవంత్ ఆరోపించారు.  గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. టీఎస్ పీఎస్సీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.  తెలంగాణ వచ్చాక పోటీ పరీక్షలు పారదర్శకంగా జరగడం లేదని విమర్శించారు.పేపర్ లీకేజ్ పై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో  విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.