జైత్రం నాయక్ మృతికి 317 జీవోనే కారణం

జైత్రం నాయక్ మృతికి 317 జీవోనే కారణం

మహబూబాబాద్: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మృతికి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోనే కారణమని ఆరోపించారు. జైత్రం అంత్యక్రియలను పోలీస్ పహారా మధ్య నిర్వహించడం వల్ల కుటుంబ సభ్యులు కడచూపునకు కూడా నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే సర్కారు తరపున కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. జైత్రం నాయక్ మరణించి నెల రోజు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ పరామర్శించలేదన్నారు. 

రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన కొనసాగుతోందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 317 జీవోను తీసుకొచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్.. ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోయేలా చేస్తోందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి 317 జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతోందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ఈ జోవోను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. జైత్రం కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు

కేసీఆర్ను ముట్టుకుంటే భస్మం అయితరు

కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లు.. మరి పేదలకు?