ఆ మంత్రిని చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినేలా చేస్త: రేవంత్

ఆ మంత్రిని చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినేలా చేస్త: రేవంత్

వచ్చే పదేళ్లు  అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే  అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరు బెదిరిస్తున్నారో వారి పేర్లు డైరీలో రాసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎరగట్లలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డిమాట్లాడారు.  స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ కి ఎక్కువ ఎంపీటీసీకి  తక్కువని విమర్శించారు.  కేసీఆర్ ఇంట్లో వేముల ప్రశాంత్ రెడ్డి అన్ని పనులు చేస్తారని వ్యాఖ్యానించారు.  అమరవీరుల స్థూపం నిర్మాణ పనులు ఆలస్యం చేసి బడ్జెట్ ను పెంచి  కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు.

మంత్రి వేముల అమరవీరుల స్థూపం నిర్మాణంలో  ఆంధ్రావారికి కమీషన్లు కట్టబెట్టి  తెలంగాణ వాదిని అంటున్నాడని ఆరోోపించారు రేవంత్.   ప్రశాంత్ రెడ్డిని చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా అంటూ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిన ఎంపీ పత్తాలేకుండా పోయిండని విమర్శించారు.