ఈ సారి కాంగ్రెస్ కు 72 సీట్లు ఖాయం

ఈ సారి కాంగ్రెస్ కు 72 సీట్లు ఖాయం

ఈ సారి కాంగ్రెస్ 72 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని.. అధికారంలోకి రావడాన్ని ఎవరు ఆపలేరన్నారు.మండలాల అధ్యక్షుల పనితీరు బాగుండాలన్నారు.. వారు గట్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో గెలవడం ఈజీ అన్నారు.ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులైనా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలన్నారు.బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. 17 పార్లమెంట్ లో ప్రత్యేక నివేదికలు తయారు చేస్తామన్నారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీనం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలన్నారు. డీసీసీలు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలన్నారు. హైదరాబాద్ లో రూ.10 వేలు ఇవ్వలేని కేసీఆర్..రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.