ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులకు పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు.. బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బందిపై నిఘా పెట్టాలని సూచించారు. 

సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.