కేసీఆర్ మొగోడైతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలె

కేసీఆర్ మొగోడైతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలె

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ మొగోడైతే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొన్న రేవంత్.. సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి చేతకాకనే బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడని విమర్శించారు. యూత్ కాంగ్రెసోళ్లను చూస్తేనే కేసీఆర్ లాగు తడవాలని రేవంత్ అన్నారు.

12 నెలల్లో కాంగ్రెస్దే అధికారం
ఏడాదిలోపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపై 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం సోనియా గాంధీ కాళ్లు మొక్కేందుకైనా సిద్ధమని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబసభ్యులకు ఉద్యోగాలు వచ్చాయే తప్ప నిరుద్యోగులకు కాదని అన్నారు. యువతకు ఉద్యోగాలివ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడబీకాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి తెచ్చేందుకే నిరసన దీక్ష చేపట్టామన్న ఆయన.. రాష్ట్రంలోని 30లక్షల మంది నిరుద్యోగాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా ప్రగతి భవన్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొదటి సంతకం ఆ ఫైల్ మీదే చేస్తారని చెప్పారు. ఏబీసీడీలు రాని వారు కూడా దేశానికి స్వాతంత్ర్యం సాధించిన కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారం పోగొట్టుకొని మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని... ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ప్రజల కలలు సాకారమయ్యేవని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు పట్టిన చీడ పురుగైన కేసీఆర్ను తరిమేసినప్పుడే రాష్ట్ర సమస్యలు తీరుతాయని అన్నారు.

For more news..

కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్