మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్

మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మనసు మార్చుకున్నారు. బెలారస్ వేదికగా రష్యాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే జెలెన్స్కీ ఈ ప్రకటన చేశారు. గెమెల్లో భేటీకి అంగీకరించారు. ఇంతకు ముందు బెలారస్ వేదికగా ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని రష్యా ప్రతిపాదించగా.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అందుకు నిరాకరించారు. రష్యా ఆ ప్రాంతం నుంచే క్షిపణి దాడులు చేస్తోందని అందుకే అక్కడ చర్చలకు అంగీకరించనని చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలోనే మనసు మార్చుకున్న జెలెన్స్కీ భేటీకి సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తల కోసం..

రష్యా అధ్యక్షుడికి మరో షాక్

భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తం