కేటీఆర్ ..దీనిని అభివృద్ధి అంటారా..? అరాచకం అంటారా?

 కేటీఆర్ ..దీనిని అభివృద్ధి అంటారా..? అరాచకం అంటారా?

బలవంతంగా భూమిని గుంజుకోవడం… బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం… కేటీఆర్… దీనిని అభివృద్ధి అంటారా…?! అరాచకం అంటారా!? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోపరిహారం ఇవ్వకుండా, తమ సమస్యలు పరిష్కరించకుండా భూములు లాక్కున్నారంటూ నిమ్జ్ భూ నిర్వాసితులను నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు  భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ర్యాలీగా వచ్చిన భూ నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు.... వారిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ రకమైన కామెంట్స్ చేశారు. భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు… లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా…?! అని దుయ్యబట్టారు.