సీఎం కేసీఆర్ “ఆపరేష‌న్ జీ” స్కెచ్ అదుర్స్

సీఎం కేసీఆర్ “ఆపరేష‌న్ జీ”  స్కెచ్ అదుర్స్

ఆపరేష‌న్ జీ బ్లాక్ సంబంధించి సీఎం కేసీఆర్ ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. సెక్రటేరియేట్ పై కేంద్ర సంస్థ ఎన్ ఎండీ తో సర్వే జరిగింద‌ని, ఆ స‌ర్వేలో స‌చివాల‌యం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ ఆరోవ నిజాం కాలంలో నాణాల ముద్ర‌ణ జ‌రిగిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింద‌న్నారు.

గ‌తంలో జీ బ్లాక్ లో గుప్త నిధులు ఉన్నాయ‌ని నేష‌నల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని అన్నారు. G-బ్లాక్ నుంచి బయటకు సొరంగ మార్గాలు ఉన్నాయ‌ని, అందుకే వాటి కింద గుప్త నిధుల ఉంటాయ‌నే అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. సెక్రటేరియేట్ కింద చారిత్రాత్మక విషయాలు, ఆధారాలు ఉన్నాయని మర్రి చిన్నా రెడ్డి అప్పటి కేంద్రానికి చెప్పిన‌ట్లు గుర్తు చేశారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో సచివాలయం కూల్చివేతకు సంబంధించి సీఎం ఎన్నో ఏళ్లుగానే వ్యూహ రచన చేస్తున్నారని, సచివాలయంలోని జీ బ్లాక్‌ గురించి పలుమార్లు సీఎం వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలను రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు.

వేల కోట్ల రూపాయల అక్రమాలు జరగే అవ‌కాశం ఉన్న‌ట్లు అనుమానంతోనే కేసీఆర్ ప‌లు శాఖలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ కు ట్రాన్స్ ఫ‌ర్ చేశార‌న్నారు. వారిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న మాయమయి, ఇరిగేషన్ శాఖ‌లో మురళీధర్ రావు, ఆర్కియాలజీ శాఖలో రఘునందన్ రావుల‌ను ఉంచార‌ని సూచించారు.

మూడేళ్ళ కింద అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్ కమిటీ వేస్తా అన్న కేసీఆర్ మూడేళ్లు ముగుస్తున్నా కమిటీ ఎందుకు వెయ్యలేదని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. బిఆర్కే భవన్ ఉద్యోగులకు సైతం సెలవులు ఇచ్చి సెక్రటేరియేట్ కూల్చాల్సిన అవసరం ఏంటో ప్ర‌భుత్వం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. స‌చివాల‌యం కూల్చాల‌నుకుంటే చుట్టూ మూడుకిలోమీటర్ల మేర పోలీస్ బందోబ‌స్త్ ఎందుకు ఏర్పాటు చేశార‌న్నారు. కూల్చుతున్న భవనాల కింద గుప్త నిధులు లేక‌పోతే అంత సీక్రెట్ గా కూల్చాల‌ని అవ‌స‌రం ఏముంద‌ని అడిగారు.

సచివాలయం కూల్చివేత పనులు వీడియో రికార్డ్ చేయడం లేద‌ని, ఆర్కియాలజీ శాఖ ఎన్ ఎండీసీ శాఖల ఆధ్వర్యంలో కూల్చడం లేదన్నారు. సచివాలయం కూల్చివేత ప్రక్రియను ప్రచారం చేసేందుకు మీడియాను అనుమతించాలని డిమాండ్ చేశారు.

స‌చివాల‌యం కూల్చివేత, నిర్మాణం పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌న్న రేవంత్ రెడ్డి..అధికార పార్టీలో చెంచాలు ఎక్కువ‌య్యార‌ని, వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.