317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం

317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం

జనం సమస్యలపై పోరులో వెనక్కి తగ్గామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. 317జీవో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వెంటనే 317 జీవోను సవరించాలన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగాలివ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వులో ఉందన్నారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 317 జీవో తెచ్చారన్నారు. బండి సంజయ్ దీక్షకు లేని గొప్పదనాలను  టీఆర్ఎస్ తెచ్చిందన్నారు. జాతరలో గంగిరెద్దోళ్లు వచ్చినట్లు బీజేపీ నేతలు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. శివరాజ్, హిమంత్ ఎలా ముఖ్యమంత్రులు అయ్యారో  అర్థం కావట్లేదన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులను ఆమోదించింది కేంద్రమేనన్నారు. కేంద్రం ఆమోదం తర్వాతే 317 జీవో వచ్చిందన్నారు. కేంద్రం ఆమోదించకపోతే జీవో వచ్చే అవకాశం లేదన్నారు. కేసీఆర్ తప్పుడు ప్రతిపాదనలకు కేంద్రం గుడ్డిగా ఒకే చెప్పిందన్నారు.  కేసీఆర్ బీజేపీ పంజరంలో ఉన్న చిలుకన్నారు. మోడీ చెప్పే చిలుక పలుకులే కేసీఆర్ పలుకుతారన్నారు. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలనుకుంటుండన్నారు. యూపీ ఎన్నికల్లో కేసీఆర్ అఖిలేష్ కు మద్దతిస్తారా అని ప్రశ్నించారు.