సహారా కుంభకోణంలో కేసీఆర్‎ను కేంద్రమే కాపాడుతోంది

సహారా కుంభకోణంలో కేసీఆర్‎ను కేంద్రమే కాపాడుతోంది

రైతుల పక్షాన పోరాటం చేయాలంటే..కల్లాల దగ్గరకు వెళ్లాలన్నారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఇవాళ (గురువారం) హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఆ తర్వాత వ్యవసాయ కమిషనర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు.. జేఏసీ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.యి. జేఏసీ అంటే..జాయింట్ ఆక్టింగ్ కమిటీ అని అన్నారు. 
ఇందిరా పార్క్ దగ్గర సీఎం కేసీఆర్.. రైతుల పక్షాన ఏం మాట్లాడుతారో అని ఎదురు చూసినమన్నారు.కానీ..ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాట్లు చూస్తే.. పరేషాన్ అవుతారన్నారు. ఏసీల్లో కూర్చుని ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కల్లాల వద్దకు వెళ్లాలని సూచించారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు.

బండి సంజయ్, కిషన్ రెడ్డి..ఢిల్లీకి వెళ్లి మోడీని నిలదీయాలన్నారు రేవంత్ రెడ్డి. సహారా కుంభకోణం లో కేసీఆర్ ను కేంద్రమే కాపాడుతోందన్న ఆయన..నేను చేసిన ఫిర్యాదులు తొక్కిపెడుతున్నారని ఆరోపించారు.