సమాజాభివృద్ధికి టీచర్లు మూలం : డీఈవో శ్రీరాం మొండయ్య

సమాజాభివృద్ధికి టీచర్లు మూలం : డీఈవో శ్రీరాం మొండయ్య

కొత్తపల్లి, వెలుగు: టీచర్లు సమాజాభివృద్ధికి మూలమని, సమాజంలో వారి పాత్ర విశిష్ఠమైందని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్​లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మార్పులకు అనుగుణంగా టీచర్లు అన్ని విషయాలను నేర్చుకోవడమే కాకుండా వాటిని విశ్లేషణాత్మకంగా సమగ్రంగా అమలుపరిచి విద్యార్థుల సర్వతోముభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టీచర్లను సత్కరించారు. కార్యక్రమంలో అల్ఫోర్స్​ చైర్మన్​ నరేందర్​రెడ్డి, కోర్స్ సమన్వయకర్త అశోక్​రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జయపాల్​రెడ్డి, అంజిరెడ్డి, భగవంతరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.   

టీచర్లు ఆదర్శంగా ఉండాలి: ఎమ్మెల్యే సంజయ్​

జగిత్యాల రూరల్/జగిత్యాల టౌన్, వెలుగు: విద్యార్థులకు టీచర్లు ఆదర్శంగా ఉండి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకునేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో జిల్లా తెలుగు పండిట్ టీచర్ల వృత్యాంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఈవో రాము నాయక్, కోర్సు డైరెక్టర్ బాసిత్, ఎస్‌‌‌‌‌‌‌‌వో రాజేశ్, మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చారి, టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘ లీడర్లు నరేందర్ రావు, ప్రసాద్ రావు పాల్గొన్నారు. 

ఓల్డ్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న హిందీ శిక్షణ శిబిరంలో నిర్వహించిన టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రస్థాయి పరిశీలకుడు దుర్గాప్రసాద్ పరిశీలించారు. శిక్షణలో టీచర్ల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో డీఈవో రాము, జిల్లా సెక్టోరల్ ఆఫీసర్లు రాజేశ్‌‌‌‌‌‌‌‌, మహేశ్‌‌‌‌‌‌‌‌, హిందీ రీసోర్స్‌‌‌‌‌‌‌‌ పర్సన్స్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, సంపత్, సుధాకర్, గణేశ్‌‌‌‌‌‌‌‌, శ్రీధర్ పాల్గొన్నారు.