
మెటా కంపెనీ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త యాప్ను లాంచ్ చేసింది. ఆ యాప్ ఏంటంటే.. ఐపాడ్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఐపాడ్ యాప్. ఈ యాప్ ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడొచ్చు. అలాగే ఫ్రంట్, బ్యాక్ కెమెరా సపోర్ట్ చేస్తుంది.
ఫోన్ కాల్ మాట్లాడుతున్న టైంలో స్క్రీన్ షేరింగ్ వంటి మోడర్న్ టెక్నాలజీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ద్వారా ఐపాడ్ ఓఎస్ మల్టీ టాస్కింగ్ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. స్టేజ్ మేజర్, స్ప్లిట్ వ్యూ, స్లయిడ్ ఓవర్ వంటి ఫీచర్లు కూడా ఒకేసారి వాడొచ్చు. ఐపాడ్ యాప్లో చాట్ లాక్ అనే స్పెషల్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ యాప్ గ్లోబల్గా అందుబాటులో ఉంది.