సీఎం ధ్యాసంతా కమీషన్ల మీదే..జీవో 203 శాపమే..

సీఎం ధ్యాసంతా కమీషన్ల మీదే..జీవో 203 శాపమే..

‘కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంది. దక్షిణ తెలంగాణ రైతులను, ప్రజలను నిలువునా ముంచేలా మీ కార్యాచరణ కనపడుతోంది. మీ ధ్యాసంతా కాంట్రాక్టులు, కమీషన్లమీదే.. తప్ప సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే ఉద్దేశం కనపడటం లేదు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపే ద్దేశం మీలో కనిపించటం లేదు. మీ పని మీరు చేసుకోండి.. మేం చూసి చూడనట్లు వహరిస్తమని ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు ప్రజల్లో నుమానం క్తమవుతోంది”అనికాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ రకు ఆదివారం రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్కు ఓ లేఖ రాశారు.

సొంత ప్రయోజనాల కోసమే..

వైసీపీ, టీఆర్ఎస్ నేతలు రెండు రాష్ట్రాల్లో పనులు సుకుంటూ ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలను మరొకరు కాపాడుకునే పనిలో ఉన్నారని రేవంత్ విమర్శించారు. రాష్ట్ర, రై తుల ప్రయోజనాలను కట్టు పెడుతూ దొంగలు దొంగలు ఊళ్లుపంచుకున్నట్లు రెండు పార్టీల పార్టీ నేతల పనులు ఉన్నాయని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ పాలిట జీవో 203 పంగా మారుతుందని ఎంత మొత్తుకున్నా సీఎం కేసీఆర్ కు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని రేవంత్ మండిపడ్డారు. అపెక్స్ మీటింగ్ వాయిదా వేయాలన్న నిరయ్ణంతో కేసీఆర్చీకటి బాగోతంపై అనుమానాలు నిజమయ్యా యన్నారు. ప్రజలకు అనుమానం రాకుండా సుప్రీంకోర్టులో వేసిన కేసులో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. ఏపీ నీటి చౌర్యంపై స్పష్టం చేయకుండా మహారాష్ట్ర, కర్నాటకలను భాగస్వామ్యం చేయటం దేనికని రేవంత్ ప్రశ్నించారు.

కొడంగల్ లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలి..

అన్ని అనుమతులు ఉండి, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ పనులను వెంటనే ప్రారంభించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ‘‘ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట–కొడంగ ల్ ప్రాంతాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. అక్కడి కరువు పరిస్థితులు చూడలేక ప్రియదర్శిని జూరాల నుంచి సాగు, తాగునీటి కోసం ఉమ్మడి రాష్ట్రంలో లిఫ్ట్స్కీంను ప్రతిపాదించాం. నారాయణ పేట–కొడంగల్ లిఫ్ట్ఇరిగేషన్ స్కీం పేరుతో రూ.1,450.51 కోట్లతో 1.07 లక్షల ఎకరాలు సాగునీరు అందించేలా ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం తెచ్చుకున్నాం. జీవో 69 ద్వారా రూ.133.86 కోట్లువిడుదల చేశారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా నీళ్లుఇస్తామని చెప్పి ఈ స్కీంను అటకెక్కించా రు. ఇప్పుడు 1 టీఎంసీకి పాలమూరును కుదించారు. దీని వల్లనారాయణపేట–కొడంగల్ ప్రాంతాలకు నీళ్లురావనే విషయం అర్థమవుతోంది.ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొంది, ఎలాంటి వివాదాలు లేని, తక్కువ ఖర్చుతో అయ్యేఈ లిఫ్ట్స్కీంను ఆపి మీరు సాధించిందేంటి’’ అని రేవంత్ ప్రశ్నించా రు. అన్ని అనుమతులు పొందిన ఈ లిఫ్ట్విభజన చట్టంలోకి రాదని, పొరుగు రాష్ట్రాలే అభ్యంతరంపెట్టవని, వెంటనే ఈ లిఫ్ట్పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ లిఫ్ట్పనులు ప్రారంభించకపోతే రైతులు, ఆ ప్రాంత ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని రేవంత్ హెచ్చరించారు.