మేనిఫెస్టో కాంగ్రెస్ కు భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిది: రేవంత్ రెడ్డి

మేనిఫెస్టో కాంగ్రెస్ కు భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిది: రేవంత్ రెడ్డి

మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీధర్ బాబు కన్వీనర్ గా ఏర్పడిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించిందని చెప్పారు. ఉద్యమకారులు, మేధావులతో చర్చించి వారి సూచనలు, సలహాలు తీసుకుని మేనిఫెస్టోను తయారు చేశామని అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని.. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

2023, నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. నవంబర్ 17వ తేదీ శుక్రారం  పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే.. 'అభయ హస్తం' పేరుతో 42 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.  ఇప్పటికే ఆరు గ్యారంటీలు, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ లను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.