కొడంగల్ గడ్డ.. తెలంగాణను దత్తత తీసుకుంటది: రేవంత్ రెడ్డి

కొడంగల్ గడ్డ.. తెలంగాణను దత్తత తీసుకుంటది: రేవంత్ రెడ్డి

మనకు అండగా నిలబడడానికి, కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వచ్చిన ప్రియాంక గాంధీ గారికి మనస్పూర్తిగా ధన్వవాదాలు తెలుపుతున్నాని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీతోపాటు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

రేవంత్ రెడ్డి ప్రసంగంలో హైలెట్స్

  • ఈ కొడంగల్ నాకు అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది.
  • ఈ కొడంగల్ నాకు పోరాటాన్ని నేర్పింది.
  • తల తెగి కింద పడ్డా.. ఎవరి ముందు లొంగకుండా ఉండేలా ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది.
  • 20ఏళ్లు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడానంటే.. అది కొడంగల్ గడ్డ అండతోనే సాధ్యమైంది.
  • మీరు అండగా ఉంటే.. అది నరేంద్ర మోడీ అయినా, కేసీఆర్ అయినా కోట్లాడి వాళ్ల మెడలు వంచే బాధ్యత నాది.
  • కొడంగల్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే.
  • నేను మీరు నాటిన వృక్షాన్ని.. ఆ వృక్షాన్ని కల్వకుట్ల తారకరామారావు నరకాలని చూస్తున్నాడు.
  • తండ్రీకొడుకులు కలిసి మీరు పెంచిన వృక్షాన్ని నరికేస్తామంటున్నరు.. నరకనిస్తరా.. ఎవరొచ్చినా పాతాళానికి తొక్కుతరా? మీ ఇష్టం.
  •  సిరిసిల్ల నుంచి వచ్చిన దద్దమ్మ కేటీఆర్.. కొడంగల్ ను దత్తత తీసుకుంటా అన్నడు.
  • నేను చెబుతున్నా.. కొడంగల్ నియోజకవర్గమే తెలంగాణను దత్తత తీసుకుంటుంది.
  • నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇస్తుంది.
  • రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను ఇస్తుంది.
  • మనందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ చెప్పిండు. కానీ ఎవరికీ ఇవ్వలేదు.
  • కొడంగల్ గడ్డ నుంచి నేను మాటిస్తున్నా.. రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా.
  • ధరణిని తీసుకొచ్చి 10వేల ఎకరాలను కేసీఆర్ ఆక్రమించుకున్నాడు.