
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. 2023 డిసెంబర్ 07 గురువారం మధ్యాహ్నం 1 గంటల 04 నిమిషాలకు సీఎంగా రేవంత్ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. ముందుగా ఉదయం 10 : 28 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం నిర్వహించాలని భావించారు. కానీ తాజాగా టైమ్ లో మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సీఎం ప్రమాణ స్వీకరానికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో చకచక జరుగుతున్నాయి. సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. డీజీపీ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పర్యవేక్షించారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తుపను ఏర్పాటు చేశారు.