మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి షోకాజ్ నోటీసులు

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి షోకాజ్ నోటీసులు

సూర్యాపేట జిల్లా : అక్రమంగా భూకబ్జా చేసి నిర్మించిన సిమెంట్ పరిశ్రమలకు రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోటీసులు పంపింది. భూ దాన్ ఉద్యమంలో సేకరించిన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు గుర్తించారు.  మై హోమ్ సిమెంట్ పరిశ్రమ కు నోటీసులు జారీ చేశారు. ఆక్రమించిన 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసుల పంపించారు. మైహోమ్ సహా మరో నలుగురికి రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోటీసులు జారీ చేశారు.  


గత పదేళ్లుగా మేళ్లచెరువు  రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057 లో 150 ఎకరాల భూదాన్ భూమి అక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులోని 113 ఎకరాల భూదాన్ భూమిని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ,18.20 ఎకరాలు కీర్తి సిమెంట్ ఫ్యాక్టరీ, ఇద్దరు రైతులు 3.19 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. ఈ నలుగురికి భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ్ దాన్ చట్టం సెక్షన్ 24 A ద్వారా షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈనెల 16 న సీసీఎల్ఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.