ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలపై మొదటి నుంచీ 28 శాతమే

ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలపై  మొదటి నుంచీ 28 శాతమే
  • స్పష్టం చేసిన రెవెన్యూ సెక్రటరీ

ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలు మొదటి నుంచీ 28 శాతం జీఎస్​టీ చెల్లించాల్సిందేనని రెవెన్యూ సెక్రటరీ సంజయ్​ మల్హోత్రా స్పష్టం చేశారు. జీఎస్​టీ కౌన్సిల్​ 52వ మీటింగ్​ సందర్భంగా ఢిల్లీ, గోవా వంటి రాష్ట్రాలు రెట్రాస్పెక్టివ్​ పన్ను విధింపుపై అభ్యంతరాలు లేవనెత్తాయి. దీనిపై రెవెన్యూ సెక్రటరీ పైవిధంగా క్లారిటీ ఇచ్చారు. ‘ఇది రెట్రాస్పెక్టివ్​ విధింపు కాదు. అప్పటికే ఉన్న రూల్’ అని ఆయన పేర్కొన్నారు. డబ్బుతో బెట్​వేసి  ఆడే ఆన్​లైన్​  గేమ్స్​పై ఎప్పటి నుంచో 28 శాతం జీఎస్​టీ అమలులో ఉందని వివరించారు.

బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ కిందకి వచ్చే వాటిపై 28 శాతం జీఎస్​టీ అమలు చేయాలనే రూల్స్​ పేర్కొంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. గత ఆరేళ్ల కాలానికి 28 శాతం చొప్పున లెక్కించి జీఎస్​టీ చెల్లించాలని ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలను కోరడం కరెక్ట్​  కాదని ఢిల్లీ ఫైనాన్స్​ మినిస్టర్​ అతిషి ప్రస్తావించారు. అక్టోబర్​ 1 నుంచే 28 శాతం జీఎస్​టీ అమలులోకి తెచ్చిన కారణంగా, అంతకు ముందు కాలానికీ అదే రేటు చెల్లించాలనడం సరైనది కాదని పేర్కొన్నారు. 

డీజీజీఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుందని, ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని, డీజీజీఐ ఏదైనా క్లారిఫికేషన్​ కోరితే ఇస్తామని జీఎస్​టీ కౌన్సిల్​ పేర్కొంది.