- నిరుద్యోగులను స్వార్థానికి వాడుకుంటున్నరు: మానవతారాయ్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1పై బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని నిరుద్యోగులను పీసీసీ అధికార ప్రతినిధి, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ కోరారు. ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయిన కొంత మంది మెయిన్స్‌కు కొద్ది రోజుల ముందు కృతిమ నిరుద్యోగ ఉద్యమం చేస్తున్నా రని ఆరోపించారు. 8 మంది అభ్యర్థులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండతో హైకోర్టును ఆశ్రయించారని, ఇందులో ఆరుగురు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేసు నిలబడడం కోసం మధ్యలో ఇద్దరు అర్హత సాధించిన అభ్యర్థులను పిటిషన్‌లో చేర్చారన్నారు. సోమవారం నుంచి పరీక్ష రాయనున్న 31 వేల మంది అభ్యర్థుల్లో 90 శాతం మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఇప్పుడు వారిలో ఆందోళన స్టార్ట్ అయిందన్నా రు. హైకోర్టుకు వెళ్లిన అభ్యర్థులే గతంలో జీవో 55ను ఎత్తివేయాలని ప్రభుత్వానికి, టీజీపీఎస్సీ చైర్మన్‌కి వినతిపత్రాలు ఇచ్చి, మళ్లీ ఇప్పుడు జీవో 29ని రద్దు చేయాలని ప్రయత్నించడం విడ్డూరమన్నారు.
గతంలో డీఎస్సీ పరీక్ష జరగకుండా అడ్డుకునేందుకు కొద్దిమంది అభ్యర్థులు కుట్రపూరితంగా వ్యవహరించారని, బీఆర్‌ఎస్ రాజకీయ ప్రోద్భలంతో హైకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. కొంతమంది కృత్రిమ నిరుద్యోగులను బీజేపీ, బీఆర్ఎస్ తమ రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నాయని, సాధారణ నిరుద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.