రివ్యూ: లక్ష్య

రివ్యూ: లక్ష్య

నటీనటులు: నాగశౌర్య,కేతిక శర్మ,జగపతిబాబు, సచిన్ కేద్కర్,శత్రు,భరత్ రెడ్డి,కిరీటి తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్
మ్యూజిక్: కాల భైరవ
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్,శరత్ మరార్,పుస్కూర్ రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం : సంతోష్ జాగర్లమూడి
రిలీజ్ డేట్: డిసెంబర్ 10,2021

కథేంటి?
పార్థు (నాగశౌర్య) కు చిన్నప్పటి నుండే విలు విద్య అంటే ఇష్టం.ఆ ఆటలో చాంపియన్ అవ్వాలని వాళ్ల తాత (సచిన్ కేద్కర్) కలలు కంటాడు.అందుకోసం అన్ని సమకూర్చుతాడు.తాత లేకుంటే పార్థుకు ఆడటం తెలియదు. స్టేట్ చాంపియన్ అయిన తర్వాత వాళ్ల తాత చనిపోతాడు.ఆ బాధ వల్ల ఆటమీద దృష్టి ఉండదు.దాంతో డ్రగ్స్ కు అలవాటు పడి ఆడుతుంటాడు.చివరకి డోప్ టెస్ట్ లో దొరికి డిస్ క్వాలిఫై అవుతాడు.తర్వాత ఏం చేశాడు.మళ్లీ ఆడి చాంపియన్ అయ్యాడ లేదా అనేది కథ.
నటీనటుల పనితీరు:
నాగ శౌర్య ఈ రోల్ కు బాగా సూట్ అయ్యాడు.సిక్స్ ప్యాక్ బాడీ తో కూడా కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.కేతిక శర్మ ఉందా అంటే ఉంది అన్నట్టు ఉంది.పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.జగపతి బాబు తన పాత్రలో ఒదిగిపోయి నటించారు.సినిమాకు ప్లస్ అయ్యారు.సచిన్ కేద్కర్ కూడా మెప్పించాడు.శత్రు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా చేశాడు.సపోర్టింగ్ రోల్ లో కిరీటి ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ వర్క్:
రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది.కాల భైరవ ఇచ్చిన పాటలు వినసొంపుగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.ఎడిటింగ్ ఫర్వాలేదు.డైలాగులు ఓకే. ఆర్ట్ వర్క్ బాగుంది.ఆర్చరీ గేమ్ కు కావాల్సిన సెటప్ అంతా పెర్ఫెక్ట్ గా ఉంది.
విశ్లేషణ:
‘‘లక్ష్య’’ రెగ్యులర్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామ. చివరికి ఏం జరుగుతుందో ఇంటర్వెల్ కే తెలుస్తుంది.ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే టైట్ గా ఉండాలి.జనాలను ఎంగేజ్ చేయగలగాలి కానీ డైరెక్టర్ సంతోష్ ట్రీట్ మెంట్ బాగోలేదు. అందువల్ల బోర్ కొడుతుంది. ఫస్టాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.లవ్ ట్రాక్ అస్సలు బాగోలేదు.సెకండాఫ్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.కానీ క్లైమాక్ తేలిపోయింది . సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారు.అప్పటివరకు హీరో కుడిచేతి పనిచేయదు అని వైద్యుడు చెప్పినా కానీ.. చివరి రౌండ్ లో కుడి చేత్తే బాణం సందిస్తాడు.ఇలాంటి లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఓకేనేమో కానీ.. థియేటర్ కు వచ్చి ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు.
బాటమ్ లైన్ : లక్ష్యం గురి తప్పింది.