కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’. తెలుగులో జన నాయకుడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో.. సామజిక కథ, కథనాలతో రూపొందుతుంది.
ఖాకీ డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో మాత్రమే కాకుండా, దేశ రాష్ట్ర రాజకీయాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026 జనవరి 9న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటం.. అందుకు కొన్ని నెలల ముందు సినిమా విడుదల అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, రీసెంట్గా విజయ్ సభలో జరిగిన తొక్కసలాటాలో 40 మందికి పైగా చనిపోవడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే సినిమాకు బ్రేక్ పడిందంటూ.. రిలీజ్ కూడా వాయిదా పడతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అవన్నీ రూమర్స్ అంటూ.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.
లేటెస్ట్గా (2025 నవంబర్ 6న) జన నాయకుడు మూవీ.. 2026 జనవరి 9న సంక్రాంతికి వస్తుందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ కోరమీసాలతో మాస్ అండ్ స్టైలిష్ లుక్లో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా త్వరలో కొత్త షూటింగ్ షెడ్యూల్ షురూ అవ్వనున్నట్లు, అందులో విజయ్ జాయిన్ అవ్వనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
►ALSO READ | Prabhu Deva, Anasuya: ప్రభుదేవాకు మత్తెక్కిస్తున్న అనసూయ .. రొమాంటిక్ పాటతో హీట్ పెంచేశారుపో!!
ఈ క్రేజీ అప్డేట్తో విజయ్ ఫ్యాన్స్లో సంబురాలు మొదలయ్యాయి. తమ అభిమాన హీరో లాస్ట్ మూవీ, పొంగల్ బరిలో చూడాలని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కొన్ని అవాంతరాల జరగడంతో అందరూ ఒక్కసారిగా మౌనంగా నిల్చుండిపోయారు. ఇక ఈ క్రమంలోనే అనుకున్న తేదీకే మూవీ రాబోతుందని చిత్రబృందం ప్రకటించడంతో ఫ్యాన్ ఖుషి అవుతున్నారు.
Let's Begin 🔥🔥🔥#Thalapathy @actorvijay sir #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries #JanaNayagan#JanaNayaganPongal #JanaNayaganFromJan9 pic.twitter.com/4VlEonM0Q9
— KVN Productions (@KvnProductions) November 6, 2025
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్, మమిత బైజు, వరలక్ష్మి శరత్ కుమార్, మోనిషా బ్లెస్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
