వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. బ్రహ్మోత్సవాలకు 14 వ తేది అంకురార్పణ జరగనుంది.  శ్రీవారి  నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 24 న దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. ఇక ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవలు 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.

ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఏ రోజు ఏ వాహనం మీద దర్శనం ఇస్తారంటే?

  • ఈ నెల 14న అంకురార్పణ
  •  15న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం,
  •  16న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం,
  •  17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం,
  • 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం,
  •  19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం,
  •  20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పకవిమానం, రాత్రి గజ వాహనం,
  •  21న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,
  • 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు.
  • 23న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది.

  
బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను పైక అనుమతించమన్నారు.  గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు గ్యాలరీలలో వేచి ఉంటారని అంచనా వేస్తున్నారు.  శ్రీవారి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ... టీడీడీ  అధికారులతో సమన్వయం చేసుకొని అన్ని విభాగాల వారు సిద్దంగా ఉన్నారని జిల్లా కలెక్టర్. ఎస్పీ తెలిపారు.     అంతకుముందు ఈవో విభాగాల వారీగా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష  నిర్వహించారు.  ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ALSO READ : ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష