
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెన్సర్లు, ఎలక్ట్రిక్ టెక్నాలజీలతో పనిచేసే రివోల్ట్ బైకులను రివోల్ట్ ఇంటెల్కార్ప్ హైదరాబాద్ మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. రివోల్ట్, మైక్రోమ్యాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మ ఆర్‌వీ 300, ఆర్‌వీ 400 మోడల్స్‌ను నగరంలోని జూబ్లీహిల్స్‌లోని రివోల్ట్ హబ్‌లో ఆవిష్కరించారు. వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల ప్రయాణింవచ్చు. 4.5 గంటల్లో చార్జింగ్ పూర్తవుతుంది. రిమూవల్ బ్యాటరీ మరో స్పెషాలిటీ. అంటే బ్యాటరీని బయటికి తీసుకొని, చార్జ్ చేశాక తిరిగి బండికి బిగించుకోవచ్చు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఏఐ టెక్నాలజీ వల్ల బైక్‌ను జియో లొకేట్ చేయవచ్చు. బండిని సౌండ్‌ను మార్చుకోవచ్చు. జియో ఫెన్సింగ్ సదుపాయమూ ఉంది. గూగుల్ వాయిస్ ఎనబుల్డ్ హెల్మెట్‌తో బండిని కంట్రోల్ చేయొచ్చు. ‘‘రివోల్ట్ స్టార్ట్’’ అనే పలకగానే బండి స్టార్ట్ అవుతుంది. మొబైల్ యాప్‌తోనూ బండిని కంట్రోల్ చేయవచ్చు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ‘‘నేను ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చదివాను. ఎలక్ట్రిక్, ఐఏ వెహికిల్స్ తయారీకి రూ. 400–500 కోట్ల పెట్టుబడి పెట్టాం. కంపెనీకి మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గుర్గావ్ ఉంది. ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 1.2 లక్షల యూనిట్లు. ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికిల్స్ డిమాండ్ కంటే ఈ ప్లాంట్ కెపాసిటీ చాలా ఎక్కువ. ఆర్‌వీ 400 మోడల్, 125 సీసీ పెట్రోల్ బైక్‌కు ధీటుగా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. ఆర్ వీ 300 ధర రూ. 84,999 కాగా, ఆర్ వీ 400 ధర రూ. 1,03,999. మూడేళ్ల వరకు వారంటీ ఉంటుంది. ఎనిమిదేళ్లు లేదా 1.5 లక్షల కి.మీ(ఏది ముందైతే అది) వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తారు. బైక్‌లో త్రీ మోడ్స్ ఉంటాయి. మోడ్‌ని బట్టి స్పీడ్ డిసైడ్ అవుతుంది. ముందువెనకా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఈ రెండు బ్రేక్స్ కలిసుంటాయి కాబట్టి ఏ బ్రేక్ పట్టినా రెండు వీల్స్‌పైనా ప్రభావం ఉంటుంది.