ప్రజలను ఎందుకు వేధిస్తున్నరు?

ప్రజలను ఎందుకు వేధిస్తున్నరు?

హైదరాబాద్: ఝార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సర్కారు రీసెంట్ గా పెట్రో ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గించింది. దీంతో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల మీదా పెట్రో రేట్లు తగ్గించాలనే ఒత్తిళ్లు ఎక్కువవుతన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరల తగ్గింపు అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలకు దిగారు.

పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినప్పుడు.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఎందుకు తగ్గించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ పైసా తగ్గించేది లేదంటున్నారని.. ఖజానా దివాళా తీసిందా అని క్వశ్చన్ చేశారు. ప్రజలను పన్ను పోటుతో వేధించడం మీకు పైశాచక ఆనందాన్ని ఇస్తోందా అని కేసీఆర్ ను దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తది?

ఆదాయం పెంచుకోవడమే ముఖ్యమా?

గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు