కేసీఆర్ జపాన్ ఎలుక లాంటి వాడు

కేసీఆర్ జపాన్ ఎలుక లాంటి వాడు

హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ చింత మడక చీటర్ అని..మూడు చింతలకు కట్టి చీల్చాలన్నారు. కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ఇవాళ్టికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబానికి మస్తు చేసిందని తెలిపారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం  కోసం కొట్లాడిండు అని రెండు సార్లు సీఎం చేసిండ్రు...కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరిస్తే.. తెలంగాణ దొంగల పాలైందన్నారు. రాష్ట్రాన్ని అడవి పందుల్లా.. దోచుకుంటుంన్నారన్నారు. దళిత, గిరిజనులందరికి బంధు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ దండోరా సభలతో..కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందన్నారు.కేసీఆర్..జపాన్ ఎలుక లాంటి వాడని.. ప్రమాదాన్ని ముందే గ్రహించి బయటికొచ్చిండన్నారు. కేసీఆర్ నీ టైం అయిపోయింది.. ఇక నీవు ఇంటికే అని అన్నారు.

ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బహుజన్ భవన్ గా మారుస్తానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అక్కడి నుండే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చూస్తామన్నారు. దళిత గిరిజన ఆది వాసుల బిడ్డలు చదువుకోవాలని..డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలన్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీలు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా మూసేసిండన్నారు. ఇండ్లు,పెన్షన్లు కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విప్రో సత్య నాదెండ్ల, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బాగా చదువు కోవడం వల్లే ఆ స్థాయికి వెళ్లారని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎవరు సీఎం అయినా.. మొదటి సంతకం, అత్యధిక బడ్జెట్.. దళిత గిరిజనుల బిడ్డల చదువుల కోసమేనని స్పష్టం చేశారు. నాకు సీఎం కావాలనే ఆశ లేదన్న రేవంత్.. తాను ఈ స్థాయికి రావడమే సంతోషమన్నారు. సోనియమ్మ ఇచ్చిన అతిపెద్ద పదవి పీసీసీ అని అన్నారు.