కోల్ ప్రొడక్షన్​లో ఆర్జీ-–1 రికార్డు

కోల్ ప్రొడక్షన్​లో ఆర్జీ-–1 రికార్డు
  •  ఆరు రోజుల ముందుగానే టార్గెట్​ రీచ్​

గోదావరిఖని, వెలుగు : కోల్‌ ప్రొడక్షన్‌లో సింగరేణిలోని ఆర్జీ 1 ఏరియా ఆరు రోజుల ముందుగానే  టార్గెట్‌ చేరుకొని రికార్డు సాధించింది.  ఈ ఏరియాకు 2023–-24 ఫైనాన్షియల్‌ ఇయర్‌‌కు 42,99,740 టన్నుల టార్గెట్​పెట్టగా.. కార్మికులు 25న నైట్‌ షిప్టు వరకు 43,97,668 టన్నులతో 102 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు. ఇందులో జీడికె ఓపెన్​ కాస్ట్​–5 క్రియాశీలకంగా పనిచేసింది. ఈ ఓసీపీలో 30 లక్షల టన్నుల  లక్ష్యం కాగా.. 25 నాటికే 34.25 లక్షల టన్నులతో 116 శాతం  ఉత్పత్తి చేశారు.  కాగా, 2018–-19లో 95 శాతం, 2019-–20లో 62 శాతం, 2020–-21లో 49 శాతం, 2021-–22లో 65 శాతం బొగ్గు ఉత్పత్తి చేసిన ఆర్జీ 1 ఏరియా ఈ యేడు ఇప్పటికే  102 శాతం సాధించింది.  

ఈ మేరకు మంగళవారం సాయంత్రం జీఎం ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో  ఆఫీసర్లు, ఉద్యోగులు, యూనియన్​ లీడర్లు, సూపర్​ వైజర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను జనరల్​ మేనేజర్​ చింతల శ్రీనివాస్​ అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో  ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ మీటింగ్​లో ఆఫీసర్లు రామ్మోహన్​, రామ్మూర్తి, బాణోతు సైదులు, చిలుక శ్రీనివాస్,  చంద్రశేఖర్​, ఆంజనేయులు, లక్ష్మినారాయణ, ధనలక్ష్మి, శివ నారాయణ, ఆంజనేయప్రసాద్​, తదితరులు పాల్గొన్నారు.