బెస్ట్‌ రీజ‌న‌ల్ ఎయిర్ పోర్ట్‌గా RGIA

బెస్ట్‌ రీజ‌న‌ల్ ఎయిర్ పోర్ట్‌గా RGIA

బెస్ట్‌ రీజ‌న‌ల్ ఎయిర్ పోర్ట్ మ‌రియు బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ స‌ర్వీస్ గా హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రెండు అవార్డుల‌ను గెలుచుకుంది. ఈ అవార్డుల‌ను స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్-2019 ప్ర‌ధానం చేసింది. యూకేలోని లండ‌న్‌లో ఈ అవార్డుల ప్ర‌ధాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. లండ‌న్‌లో ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోలో నిర్వహించిన ఈ కార్య‌క్ర‌మానికి GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్ఐఎల్) సీఈవో SGK కిషోర్ హాజరై అవార్డుల‌ను స్వీక‌రించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ప్ర‌యాణికులకు మా సంస్థ మీద ఉన్న న‌మ్మ‌కానికి సాక్ష్య‌మే ఈ అవార్డుల‌ని అన్నారు. ప్ర‌యాణికుల సంతృప్తి కోసం తాము నిరంత‌ర కృషి చేస్తామ‌ని తెలిపారు.