RGV : "నిర్మాతలందరూ సిగ్గుపడాలి": 'కాంతార: చాప్టర్ 1'పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

RGV : "నిర్మాతలందరూ సిగ్గుపడాలి": 'కాంతార: చాప్టర్ 1'పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి  తెస్తూ వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇటీవల కాలంలో తన సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు.  సంచలన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ గా కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి, నటించిన 'కాంతార: ఎ లెజెండ్: చాప్టర్ 1'  చిత్రాన్ని ఆర్జీవీ చూశారు. రిషబ్ శెట్టి ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. దేశంలోని ఇతర సినీ మేకర్స్‌కు గట్టి షాకిచ్చారు.
  
నిర్మాతలందరూ సిగ్గుపడాలి..

'కాంతార: చాప్టర్ 1' సినిమా చూసిన వెంటనే ఆర్జీవీ, తన ఆలోచనలను 'X' వేదికగా పంచుకున్నారు. ఆయన ఏకంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని దర్శక-నిర్మాతలందరూ 'సిగ్గుపడాలి' అని బహిరంగంగా వ్యాఖ్యానించారు.  "కాంతార అద్భుతం. ఈ చిత్రంలోని బీజీఎం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్,వీఎఫ్‌ఎక్స్‌లో @Shetty_Rishab (రిషబ్ శెట్టి) అతని బృందం చేసిన ఊహించలేని కృషిని చూసిన తర్వాత, భారతదేశంలోని సినీ నిర్మాతలు సిగ్గుపడాలి. కంటెంట్‌ను పక్కన పెడితే , వారి కృషి ఒక్కటే #KantaraChapter1 ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టడానికి అర్హమైనది. హే, @Shetty_Rishab, మీరు గొప్ప దర్శకుడా లేక గొప్ప నటుడా అని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు 

ALSO READ : ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'వార్ 2' ప్లాప్ అందుకే?

 

రిషబ్ రిప్లై... ఆర్జీవీ రీకౌంటర్!

ఆర్జీవీ చేసిన ఈ భారీ ప్రశంసకు రిషబ్ శెట్టి వెంటనే స్పందించారు. వినయంగా ఆయన నేను కేవలం సినీ ప్రేమికుడిని మాత్రమే సార్. మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు. అయితే, ఇంతటితో ఆగని దర్శకుడు ఆర్జీవీ, రిషబ్ శెట్టికి ఊహించని మరో రీకౌంటర్ ఇచ్చారు. ఈసారి మరింత సంచలన భాషను వాడుతూ, నిజం చెప్పాలంటే, మీరు సినీ ప్రేమికులు కాదు, మీరు సినీ F****Rసార్. ఎందుకంటే సినిమా ఎలా తీయాలో మా అందరికీ నేర్పిస్తూ, మీరు మమ్మల్ని 'F****D!" అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

బాక్సాఫీస్‌ వద్దవిశ్వరూపం

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన 'కాంతార: చాప్టర్ 1'..  దసరా సందర్భంగా అక్టోబర్ 2 విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. రిలీజైన మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి రూ.61 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. రెండో రోజు స్వల్ప తగ్గుదల కనిపించినా రూ.46 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.110 కోట్ల దేశీయ గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, వీకెండ్‌లో మరింత భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.