వ్యూహం సినిమాను బాత్రూమ్ లో చూడండంటూ బాబు, పవన్ లపై ఆర్జీవీ సెటైర్

వ్యూహం సినిమాను బాత్రూమ్ లో చూడండంటూ బాబు, పవన్ లపై ఆర్జీవీ సెటైర్

పట్టు వదలని విక్రమార్కుడిలా తరచూ టీడీపీ అండ్ కో మీద సెటైర్లు వేసే ఆర్జీవీ మరోసారి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా అధికార వైసీపీ పార్టీకి మద్దతుగా తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా అడ్డంకులను అన్నిటిని దాటుకొని విడుదలకు సిద్దమైన క్రమంలో వర్మ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

దేన్నైనా పబ్లిసిటీ కోసం వాడుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా అని అనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వ్యూహం సినిమాల మీద తన పర్సనల్ ఫిలాసఫీ అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ సంచలన కామెంట్స్ చేశాడు.

వ్యూహం సినిమా మీద విష ప్రచారం చేస్తున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ సినిమాను బాత్రూమ్ లో కూర్చొని చూడాలంటూ కామెంట్ చేశాడు. బూతు సినిమాలు చూడాలని అందరికీ ఉన్నప్పటికీ థియేటర్లో తెలిసిన వారుంటారేమోనన్న భయంతో వెళ్లరని, వ్యూహం సినిమా విషయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలకు అలాంటి భయం అవసరం లేదని నిశ్చింతగా బాత్రూమ్ లో కూర్చొని చూడండంటూ కామెంట్ చేశాడు.