బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన రియా, షోవిక్

V6 Velugu Posted on Sep 22, 2020

బాలీవుడ్  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం ఉండడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా NCB నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ ను అరెస్ట్  చేసింది.

వీరిద్దరి జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ్టి(మంగళవారం)తో నేటితో ముగియగా, స్థానిక కోర్టు ఆ కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించింది. ఈ క్రమంలో రియా, షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టులో వారి న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు(బుధవారం) విచారణ జరగనుంది.

డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబరు 9న అరెస్ట్ చేశారు. సుశాంత్ కు రియానే డ్రగ్స్ సమకూర్చినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సిండికేట్ లో రియా చక్రవర్తి ఒక యాక్టివ్ మెంబర్ అని NCB భావిస్తోంది. ఈ కేసులో వరుసగా మూడు రోజుల పాటు రియాను ప్రశ్నించిన ఎన్సీబీ ఆపై ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది.

Tagged bail, approached, Bombay High Court., Rhea, Showik

Latest Videos

Subscribe Now

More News