గిన్నీస్‌‌ రికార్డు.. 14 వేల మంది చిన్నారులతో జనగణమన

గిన్నీస్‌‌ రికార్డు.. 14 వేల మంది చిన్నారులతో జనగణమన
  • గిన్నీస్‌‌ రికార్డు నెలకొల్పిన గ్రామీ విజేత, మ్యూజిక్ డైరెక్టర్‌‌ రిక్కీ కేజ్‌‌

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మ్యూజిక్‌‌ డైరెక్టర్‌‌‌‌, గ్రామీ విజేత రిక్కీ కేజ్‌‌ రూపొందించిన ఓ వీడియో గిన్నీస్‌‌ రికార్డ్‌‌కు ఎక్కింది. ప్రముఖ సంగీత కళాకారులతో జాతీయ గీతం ‘జన గణ మన’ వీడియోను ఆయన రూపొందించారు. బ్రిటీష్‌‌ ఆర్కెస్ట్రా, కళింగ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సోషల్‌‌ సైన్సెస్‌‌ నుంచి 14 వేల మంది గిరిజన పిల్లలతో రూపొందించిన ఈ వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. సౌత్‌‌, నార్త్‌‌ ఇండియా నుంచి ప్రముఖ శాస్త్రీయ సంగీతకారులను ఒకచోట చేర్చి ఈ గీతాన్ని రూపొందించారు. పీటీ హరిప్రసాద్‌‌ చౌరాసియా, అమన్‌‌ అండ్‌‌ అయాన్‌‌ అలీ బంగాష్‌‌, రాహుల్ శర్మ తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని వినిపించారు. వీరితో పాటు బ్రిటన్‌‌లోని రాయల్‌‌ ఫిల్‌‌ హార్మోనిక్‌‌ ఆర్కెస్ట్రాకు చెందిన 100 మంది సభ్యుల బృందం ఇందులో పాల్గొంది. 14 వేల మంది గిరిజన చిన్నారులు ఇండియా మ్యాప్‌‌తో పాటు హిందీ, ఇంగ్లిష్‌‌లో భారత్‌‌ అని పేరు వచ్చేలా నిలబడి జాతీయ గీతం పాడారు.