బీసీసీఐ బిగ్ ఆఫర్ .. రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్

బీసీసీఐ బిగ్ ఆఫర్  ..   రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్

టీమిండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తనను సంప్రదించినట్లుగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తెలిపాడు. హెడ్ కోచ్ గా తాను ఇంట్రెస్ట్ గా ఉన్నానో లేదో తెలుసుకునేందుకు బీసీసీఐ తనను సంప్రదించినట్లుగా వెల్లడించాడు. అయితే జాతీయ జట్టుకు కోచ్ గా ఉండేందుకు తనకు ఇష్టమేనన్న పాంటింగ్ కానీ ప్రస్తుత  తన  లైఫ్ స్టైల్ కు అది సెట్ కాదన్నారు. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో కనిసం పది నెలలైన జట్టుతో ఉండాల్సి ఉంటుంది.. ఐపీఎల్ లో కూడా పనిచేయకూడదు. ప్రస్తుతం తాను ఇంటి వద్ద ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటున్నానని అందుకే బీసీసీఐ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లుగా  పాంటింగ్ స్పష్టం చేశాడు.  

కాగా ఐపీఎల్ లో 2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్.. గతంలో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక T20 కోచ్‌గా ఉన్నారు.   చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ వంటి మరికొందరు హై-ప్రొఫైల్ పేర్లు హెడ్ కోచ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. హెడ్ కోచ్ పోస్టు దరఖాస్తుకు 2024 మే 27ని  చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. టీ 20 వరల్డ్ కప్ తరువాత రాహుల్ ద్రవిడ్ పదివీకాలం పూర్తి్ కానుంది.