టీ20 వరల్డ్ కప్ గెలిచే సత్తా పాక్కు లేదు

టీ20 వరల్డ్ కప్ గెలిచే సత్తా పాక్కు లేదు

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20 వరల్డ్ కప్ ను గెలిచే సత్తా పాకిస్తాన్ కు లేదని తేల్చి చెప్పాడు. పాక్ టీమ్ పూర్తిగా కెప్టెన్ బాబర్ ఆజామ్ పైనే ఆధారపడుతుందని..అతను రాణిస్తేనే జట్టు విజయాలు సాధిస్తుందన్నాడు. బాబర్ విఫలమైతే మాత్రం..టీమ్ ఘోరంగా ఓడిపోతుందని తెలిపాడు. ఇలాంటి స్థితిలో పాక్ టీ20 వరల్డ్ కప్ సాధించడం కష్టమన్నాడు. 

పాక్ కు అంత సీను లేదు..
టీ20 వరల్డ్ కప్లో బాబర్ ఆజామ్ ఆడకుంటే గెలవడం కష్టం. కొన్నా్ళ్లుగా ఆజామ్ బ్యాటింగ్ను గమనిస్తున్నా. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అతను మెరుగ్గా రాణిస్తున్నాడు. అయితే వరల్డ్ కప్లో గెలవాలంటే మాత్రం ఆజామ్ రాణించాల్సిందే. అతను విఫలమైతే ఓటమి పాలవడం ఖాయం. అటు వరల్డ్ కప్ గెలవాలంటే పాక్ కు  ఓపెనర్లు, న్యూ బాల్ బౌలర్లు కీలకం. కానీ ఆసీస్లో స్పిన్నర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇక్కడ పిచ్ లు  వారికి సహకరించవు అని పాంటింగ్ పేర్కొన్నాడు. 

ఆసీస్ దే టైటిల్
ఈసారి టీ20 వరల్డ్ కప్ కూడా ఆసీస్ దే అన్నాడు పాంటింగ్. డిఫెండింగ్ ఛాంపియనే మళ్లీ ఛాంపియన్ అవుతుందని జోస్యం చెప్పాడు. సొంత గడ్డపై ఆడనుండటం ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని చెప్పాడు. ఆసీస్ టీమ్ అద్భుతంగా ఉందని..జట్టు సభ్యులు బాగా రాణిస్తున్నారన్నారు. భారత్, ఇంగ్లాండ్ టీమ్స్ కూడా ఫెవరెట్లని పాంటింగ్ అన్నాడు.