
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.9 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్ల) డ్యూయల్- కరెన్సీ లోన్‌ను సమీకరించిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. గత ఏడాది కాలంలో ఒక ఇండియన్ కంపెనీ సమీకరించిన అతిపెద్ద ఫారిన్ లోన్ ఇదే. ఈ లోన్‌కు సంబంధించి వివిధ బ్యాంకుల కన్సార్టియంతో ఈ నెల 9న ఒప్పందం కుదిరిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ లోన్ రెండు భాగాలుగా ఉంది.
2.4 బిలియన్ డాలర్లు యూఎస్ డాలర్ల (రూ.21 వేల కోట్ల)లో, 67.7 బిలియన్ జపనీస్ యెన్‌లో రిలయన్స్ తీసుకుంది. సుమారు 55 బ్యాంకులు కలిసి రిలయన్స్‌కు అప్పు ఇచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్ ఇండియా సావరిన్ రేటింగ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కంపెనీకి మూడీస్ నుంచి బీఏఏ2 రేటింగ్ ఉంది. ఇండియా సావరిన్ రేటింగ్‌ను తాజాగా మార్నింగ్‌స్టార్ బీబీబీ (లో) నుంచి బీబీబీకి అప్‌గ్రేడ్ చేసింది.