Asia Cup 2025 final: పాండ్య స్థానంలో రింకూకి ఛాన్స్ అవసరమా.. టీమిండియాకు ఐదో బౌలర్ తిప్పలు

Asia Cup 2025 final: పాండ్య స్థానంలో రింకూకి ఛాన్స్ అవసరమా.. టీమిండియాకు ఐదో బౌలర్ తిప్పలు

పాకిస్థాన్ తో ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ వేదికగా ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాండ్యకు గాయం కావడంతో ప్లేయింగ్ 11 లో మూడు మార్పులతో  బరిలోకి దిగింది. అర్షదీప్ సింగ్ స్థానంలో బుమ్రా.. హర్షిత్ రానా స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబే ఊహించిందే అయినా సూపర్-4 మ్యాచ్ లో శ్రీలంకపై గాయపడిన హార్దిక్ స్థానంలో భారత క్రికెట్ జట్టు స్పెషలిస్ట్ బ్యాటర్ తో బరిలోకి దిగడం షాక్ మాకు గురి చేస్తోంది. 

హార్దిక్ స్థానంలో జట్టు మ్యానేజ్ మెంట్ ఫినిషర్ రింకూ సింగ్ కు ఛాన్స్ ఇచ్చింది. ఈ మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. రింకూ సింగ్ జట్టులో చేరడంతో ఇప్పుడు పాండ్య లేని లోటును ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న నెలకొంది. ఈ టోర్నీలో పాండ్య కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. పవర్ ప్లే లో రెండు ఓవర్లు పాండ్య కవర్ చేస్తాడు. ఇప్పడు పాండ్య స్థానంలో బుమ్రాతో పాటు ఎవరు బౌలింగ్ చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. దూబే ఈ టోర్నీలో పర్వాలేదనిపించినప్పటికీ ఇప్పటివరకు కొత్త బంతితో బౌలింగ్ చేయలేదు. ఓవరాల్ గా ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఒక స్పెషలిస్ట్ బౌలర్ తో 16 ఓవర్లు పూర్తి చేసినప్పటికీ మిగిలిన నాలుగు ఓవర్లు దూబేనే వేయాలి. 

దూబే వేసే నాలుగు ఓవర్లలను పాకిస్థాన్ టార్గెట్ చేయొచ్చు. అభిషేక్ రూపంలో స్పిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ టోర్నీలో ఈ టీమిండియా ఓపెనర్ పెద్దగా బౌలింగ్ చేయలేదు. పాండ్య స్థానంలో అర్షదీప్ సింగ్ కు ఛాన్స్ ఇవ్వాల్సిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్ లో కొంత డెప్త్ తగ్గినా 4 ఓవర్ల బౌలింగ్ కీలకం కాబట్టి అర్షదీప్ కు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఈ మ్యాచ్ లో టీమిండియాది ఛేజింగ్ కావడం అనుకూలాంశం. మొత్తానికి పాండ్య లేని లోటును మన జట్టు ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. 
 
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): 

సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

భారత్ (ప్లేయింగ్ XI): 

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి

►ALSO READ | Asia Cup 2025 final: ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా బౌలింగ్.. ప్లేయింగ్ 11 నుంచి పాండ్య ఔట్.. రింకూకి ఛాన్స్