ఫ్రాన్స్​లో తగ్గుతున్న అల్లర్లు

ఫ్రాన్స్​లో తగ్గుతున్న అల్లర్లు
  •  మున్సిపాలిటీల్లో మేయర్ల శాంతి ర్యాలీలు 

 

పారిస్: ఫ్రాన్స్​లో అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులతో పోలిస్తే ఆదివారం రాత్రి హింసాత్మక ఘటనలు తగ్గాయని అధికారులు తెలిపారు. నిరసనకారులు వరుసగా ఆరో రోజు ప్రభుత్వ బిల్డింగులు, కార్లకు నిప్పు పెట్టారని చెప్పారు. ‘‘మరో 157 మందిని అదుపులో తీసుకున్నం. దీంతో ఇప్పటి వరకు అరెస్టు అయినోళ్ల సంఖ్య 3,354కు చేరింది. 

‘‘మరో 157 మందిని అదుపులో తీసుకున్నం. దీంతో ఇప్పటి వరకు అరెస్టు అయినోళ్ల సంఖ్య 3,354కు చేరింది. నిరసనకారులు మరో 297 కార్లు, 34 బిల్డింగులకు నిప్పు పెట్టారు. అయితే గత కొన్ని రోజులుగా జరిగిన ఘటనలతో పోలిస్తే.. ఇవి చాలా తక్కువ. దేశంలో హింసాత్మక ఘటనలు చాలా వరకు తగ్గాయి” అని పేర్కొన్నారు. ‘‘శనివారం రాత్రితో పోలిస్తే ఆదివారం రాత్రి టెన్షన్స్ తగ్గాయి. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. పెద్ద ఘటనలేవీ రిపోర్టు కాలేదు. ఒక పోలీస్ స్టేషన్, పారామిలటరీ పోస్టుపై నిరసనకారులు దాడి చేశారు. నలుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు” అని వెల్లడించారు. పారిస్ లో ఓ గ్యారేజ్​కు నిరసనకారులు నిప్పు పెట్టగా, మంటలార్పుతున్న టైమ్​లో ఫైర్ సిబ్బంది ఒకరు గుండెపోటుతో చనిపోయారని  పేర్కొన్నారు. 

ఇయ్యాల మేయర్లతో మాక్రాన్ భేటీ.. 

దేశంలో హింస, దోపిడీలకు వ్యతిరేకంగా అన్ని మున్సిపాలిటీల మేయర్లు సోమవారం ర్యాలీలు నిర్వహించారు. టౌన్ హాళ్ల నుంచి జనంతో కలిసి శాంతి ర్యాలీలు చేపట్టారు. అల్లర్ల కారణంగా కొన్ని మున్సిపాలిటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయా మున్సిపాలిటీల మేయర్లతో దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మంగళవారం సమావేశం కానున్నారు. దాదాపు 220 మంది మేయర్లు మీటింగ్ లో పాల్గొననున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పారిస్ మేయర్ విన్సెంట్ జీన్ బ్రన్ అన్నారు. ‘‘దాడిలో నా భార్య, కొడుకుకు గాయాలయ్యాయి. మున్సిపాలిటీలో పరిస్థితి గురించి వివరించినా ప్రభుత్వం త్వరగా స్పందించలేదు” అని చెప్పారు. కాగా, నల్లజాతి యువకుడిని కాల్చి చంపడంతో పోయిన నెల 27 నుంచి ఫ్రాన్స్ లో అల్లర్లు మొదలయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 45 వేల మంది సిబ్బందిని మోహరించారు.