
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ లో దుమ్ములేపాడు. లీడ్స్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ ల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి సంచలనంగా మారాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. (జూన్ 25) ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 800 రేటింగ్ పాయింట్లు సంపాదించి ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. పంత్ తో పాటు ఇతర భర్త క్రికెటర్లు కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో దూకుడు చూపించారు. కెప్టెన్ శుభమాన్ గిల్ తన సెంచరీతో ఐదు స్థానాలు ఎగబాకి 20 వ స్థానానికి చేరుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 179 పరుగులు చేసిన రాహుల్.. 10 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్‌లో 851 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (889) టెస్ట్ క్రికెట్ లో నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాడు.
►ALSO READ | ENG vs IND 2025: నవ్వడానికి కొంచెమైనా సిగ్గుండాలి.. జైశ్వాల్‌పై నెటిజన్స్ ఫైర్
వైస్ కెప్టెన్ బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. విలియంసన్ మూడో స్థానంలో.. స్మిత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియాతో తొలి టెస్టులో మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న బెన్ డకెట్..కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ సంపాదించి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓలీ పోప్ మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకోగా, జేమీ స్మిత్ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ లో బుమ్రా టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. బుమ్రాను మినహాయిస్తే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఎవరూ కూడా టాప్-10 లో స్థానం సంపాదించుకోలేకపోయారు.
A fitting reward for Rishabh Pant’s fearless and consistent performances. pic.twitter.com/17i5ACWyqF
— CricTracker (@Cricketracker) June 25, 2025