
ప్రస్తుతం ఇండియా మొత్తం జై శ్రీరామ్(Jai Sriram), జై హనుమాన్(Jai HanuMan) నినాదాలతో మారుమ్రోగిపోతోంది. ఓపక్క అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరుగగా.. మరోపక్క థియేటర్స్ లో హనుమాన్(HanuMan) వీరవిహారం చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth varma) తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. కేవలం పదిరోజుల్లోనే రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రోజు రోజుకి పెరుగుతున్న థియేటర్స్ సంఖ్యతో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి.
ఈ సందర్బంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హనుమాన్ సినిమాలోని నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనిపించింది కాసేపే అయినా కథను మలుపుతిప్పడంలో ఆయనదే ముఖ్య పాత్ర. సినిమాలో ఈపాత్రని సముద్రఖని చాలా అద్భుతంగా చేశారు. అయితే.. ముందుగా ఈ పాత్ర కోసం కాంతారా దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టిని అనుకున్నారట. ఇదే విషయాన్నీ రిషబ్ కి చెప్పగా ఆయనకు కూడా బాగా నచ్చిందట.. కానీ ఆ సమయంలో రిషబ్ కాంతారా మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉండటం వాళ్ళ నో చెప్పాల్సి వచ్చిందట.
కానీ, తప్పకుండా మీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతాను అని మాటిచ్చాడట రిషబ్. దీంతో ప్రశాంత్ నుండి వచ్చే తరువాతి సినిమాలో రిషబ్ శెట్టి ఖచ్చితంగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిషబ్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. అంతేకాదు.. కాంతారా అనంతరం హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర రిషబ్ చేసుంటే ఇంకాస్త హైప్ వచ్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ నుండి రానున్న తరువాతి సినిమాల్లో రిషబ్ కు ఎలాంటి పాత్ర ఇస్తారో చూడాలి.