మళ్ళీ పెరుగుతున్న మిర్చి రేటు

మళ్ళీ పెరుగుతున్న మిర్చి రేటు

మార్కెట్ లో మిర్చి రేటు మళ్ళీ పెరుగుతోంది. పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్న టైమ్ లో... మిర్చికి మళ్ళీ డిమాండ్ పెరిగింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ మిర్చికి 22 వేల ధర పలకడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్  జిల్లాలో మిర్చి పంటల సాగుకు ప్రసిద్ధి. వరంగల్, హన్మకొండ, జయశంకర్, జనగామ, మహబూబాబాద్  జిల్లాల్లో అధిక శాతం రైతులు మిర్చి పంటనే పండిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు ఆరున్నర లక్షల ఏకరాల్లో పంట సాగయినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మిర్చి పంటకు తెగుళ్లు సోకటంతో  కొందరు రైతులు...తోటలను దున్నేస్తున్నారు. చేతికి అందిన మిర్చిని కొందరు మార్కెట్ కు తీసుకుని వస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలో దాచుకున్న రైతులు... ఎనుమాముల మార్కెట్లో  అమ్మడానికి తీసుకురాగా... అనుకున్న దాని కంటే ఎక్కువ ధర పలకటంతో సంతోషంగా ఉన్నారు.

ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన రైతు బాబు 13 మిర్చి బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చారు.  దేశీ మిర్చి క్వింటాల్ కు 22వేల 500 రూపాయలకు అమ్ముడు పోయింది. మిగతా 341 రకం మిర్చికి 18వేల రేటు పలికింది. మిర్చి రేట్ ఒకేసారి హైక్ కావటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. మిర్చి పంటకు తెగుళ్లు సోకి పెట్టుబడి రాక అప్పులతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ టైమ్ లో కోల్డ్ స్టోరేజీలో పెట్టిన మిర్చికి మార్కెట్ లో మంచి రేటు పలుకుతోంది. ఇదే రేటు నిలకడగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.