- ప్రభుత్వ స్కూళ్లతోపాటు, ప్రైవేట్‌లోనే నిర్లక్ష్యమే
- ఉమ్మడి జిల్లాలో 5.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తయింది 3.90 లక్షల మందికే..
- యూడైస్, ఆధార్ వివరాల తేడాతో మరింత ఆలస్యం
పెద్దపల్లి, వెలుగు: విద్యార్థుల పూర్తి డీటెయిల్స్ ఒకే దగ్గర ఎంట్రీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్రిజిస్ట్రీ) ఎంట్రీ ప్రక్రియ స్లోగా సాగుతోంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయి ఏడాది అవుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా పూర్తికాలేదు.
ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూళ్లలోనే నమోదు ప్రక్రియ స్లోగా సాగుతోంది. ఇప్పటివరకు 70శాతమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. యూడైస్, ఆధార్‌లో పేర్ల తేడాల వల్లే మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
అపార్ ఎంట్రీపై లేని అవగాహన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,536 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 5.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు అపార్‌లో 3.90 లక్షల విద్యార్థులు ఎంట్రీ కాగా.. దాదాపు 70 శాతం పూర్తయినట్లు రికార్డులు చెప్తున్నాయి. ప్రభుత్వ స్కూల్స్కంటే ప్రైవేటు స్కూళ్లలోనే అపార్ఎంట్రీపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. యూడైస్‌లో వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తేడా వస్తున్నట్లు చెబుతున్నారు.
వాటిని సరిచేయించేలా పేరెంట్స్‌కు అవగాహన కల్పించాల్సిన స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో అపార్ ఎంట్రీలో సమస్యలు ఏర్పడుతున్నాయి. మరోవైపు అపార్‌లో నమోదు కాకపోవడంతో ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికప్పుడు ఆధార్‌లో చేంజెస్ సాధ్యం
కావడం లేదు.
యూడైస్, ఆధార్ వివరాలు మ్యాచ్కావట్లే..
ప్రతీ స్కూల్తమ విద్యార్థులు, టీచర్ల వివరాలను యూడైస్ ప్లస్(యునైటెడ్డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)లో ఎంట్రీ చేయాలి. వీటి వివరాలు ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఎంట్రీ చేస్తారు. కానీ చాలా స్కూల్స్యూడైస్లో ఎంట్రీ చేసేటప్పుడు ఆధార్‌ను పక్కన పెట్టిసినట్లు సమాచారం. దీంతో అపార్‌లో వివరాలు తీసుకోవడం లేదు. కానీ ఈ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఆయా స్కూళ్లు భావిస్తున్నాయి. ఇలా చాలామంది విద్యార్థుల వివరాలు మ్యాచ్ కావడం లేదు.
కొందరు పేరెంట్స్ కూడా తమ పిల్లల వివరాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల పిల్లలకు ఆధార్ కార్డులు ఉండటం లేదు. ఆధార్ కార్డుల్లోని తప్పులను సరిచేసుకునే అవగాహన కొందరి తల్లిదండ్రుల్లో ఉండడం లేదు. అలాగే తరుచూ స్కూల్స్మార్చే పిల్లల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సమస్యలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
