పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు

పెరుగుతున్న  డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు

హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. కొందరు ఫుల్లుగా తాగి మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేస్తున్నారు. మొన్న బంజారాహిల్స్, నార్సింగి ప్రమాదాలు మరవకముందే..దుండిగల్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ జరిగింది. కియా కారు, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు యువకులు స్పాట్ లోనే చనిపోగా.. ఒకరికి సీరియస్ గా ఉంది. కారులో ఉన్న యువకులంతా మద్యం తాగినట్లు గుర్తించారు పోలీసులు. నిజాంపేటలో పార్టీ చేసుకొని అర్ధరాత్రి బయటకి వచ్చిన యువకులు.. దుండిగల్ దగ్గర కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఇలా ఈ మధ్య కాలంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్లలో పది మంది వరకు చనిపోయారు. కొందరు తప్పతాగి రోడ్ల మీదకు దూసుకొచ్చి అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. యాక్సిడెంట్లలో జనాలు చనిపోతున్నా.. కొందరు తాగి డ్రైవ్ చేయడం మాత్ర మానుకోవడం లేదు.