ఆదిలాబాద్‌ జిల్లా పొచ్చర జలపాతం దిగువన రివర్‌‌ రాఫ్టింగ్‌‌

ఆదిలాబాద్‌ జిల్లా పొచ్చర జలపాతం దిగువన రివర్‌‌ రాఫ్టింగ్‌‌

బోథ్​, వెలుగు : ఆదిలాబాద్‌‌ జిల్లా బోథ్‌‌ మండలంలోని పొచ్చర జలపాతం దిగువన సాహస క్రీడల నిర్వహణకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌‌ కొయినా అడ్వెంచర్‌‌ అండ్‌‌ రివర్‌‌ రాఫ్టింగ్‌‌ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ట్రయల్స్‌‌ నిర్వహించారు. 

పొచ్చర జలపాతం దిగువన రివర్‌‌ రాఫ్టింగ్‌‌ను ప్రారంభించి.. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుఫ్టి వంతెన వద్దకు ఒకటిన్నర గంటలో చేరుకున్నారు. నేడు జిల్లా టూరిజం ప్రమోషన్‌‌ కౌన్సిల్‌‌ (డీటీపీసీ) మెంబర్స్‌‌ మీటింగ్‌‌ జరగనున్న నేపథ్యంలో గురువారమే ట్రయల్స్‌‌ నిర్వహించినట్లు ఎఫ్‌‌ఆర్‌‌వో ప్రణయ్‌‌ తెలిపారు. 

రివర్‌‌ రాఫ్టింగ్‌‌, కయాకింగ్‌‌ క్రీడలకు సంబంధించిన ప్రపోజల్స్‌‌ను కౌన్సిల్‌‌ మెంబర్స్‌‌కు ఇస్తామని, డీటీపీసీ నుంచి ఆమోదం వస్తే వర్షాకాలంలో రివర్‌‌ రాఫ్టింగ్‌‌, నీటి ప్రవాహం తగ్గిన తర్వాత కయాకింగ్‌‌ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంద్రవెల్లి ఎఫ్‌‌ఆర్‌‌వో సంతోష్‌‌ పాల్గొన్నారు.