Riyan Parag: ఐపీఎల్ 2026లో భాగంగా తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవంగా మండిపడ్డాడు. లక్నోతో జరిగిన పోరులో రాజస్థాన్ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరాగ్ మాట్లాడుతూ.. ఈ విజయంతో రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపడ్డాయి.. మ్యాచ్‌లో 38 బంతుల్లో 93 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వైభవ్ పై రియాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న ఐపీఎల్ కామెంటేటర్లపై సీరియస్ అయ్యాడు.
ఇటీవల కాలంలో 'ఈసిగరేట్ వివాదం'లో చిక్కుకున్న రియాన్ పరాగ్.. మీపై వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొంటున్నారనే ప్రశ్న ఎదురైంది. తాను మైదానంలో ఏం చేసినా ప్రజలు మాట్లాడుకుంటారనే విషయాన్ని గ్రహించానని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి విషయాలతో తన ఆట, మానసిక స్థితి దెబ్బతినకుండా చూసుకోవడం ముఖ్యం అన్నాడు. సోషల్ మీడియాలో("కీబోర్డ్ వారియర్స్" ) విమర్శించే వారి వ్యాఖ్యలని గ్రౌండ్ బయటే వదిలేయాలి.. తన ఆటపై ఉన్న నమ్మకాన్ని ఇవి దెబ్బతీయలేవని తేల్చి చెప్పాడు. మన దేశంలో ప్రజలు క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తారు, వారి అంచనాలకు తగ్గట్టుగా రాణించడానికి ప్లేయర్స్ ఎప్పుడూ శాయశక్తులా ప్రయత్నిస్తారని రియాన్ పరాగ్ వెల్లడించాడు.
ALSO READ : లైవ్‌లో తిట్టుకున్నారు.. కట్ చేస్తే సీన్ రివర్స్!
క్రికెట్ పండితులు, కామెంటేటర్లపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఆటలో పొరపాట్లు జరగడం సహజం.. ఏదైనా టీమ్ 75 లేదా 80 రన్స్ కే ఆలౌట్ అయినప్పుడు వారికి ఆడటం రాదనో, ఆడటం ఇష్టం లేదనో అనడం చాలా ఈజీ అన్నాడు. ప్రతి మ్యాచ్‌కూ ముందు ఆటగాళ్లు ఎంతో కష్టపడతారు.. కొన్నిసార్లు ప్లాన్స్ వర్కవుట్ కావని తేల్చి చెప్పాడు. కామెంటేటర్ల గొంతు నేరుగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వారు కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడాలని సూచించారు. స్టేడియం బయట ఉండే ప్లేయర్స్ వ్యక్తిగత విషయాలను లాగడం మంచిది కాదన్నారు. దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ఆటని, ఆటగాళ్లను గౌరవించాలని రియాన్ పరాగ్ తేల్చి చెప్పాడు.
🚨 Riyan Parag angry on commantartos:
— Indian Cricket Ministry (@ICM_News45) May 20, 2026
I feel, whatever is happening outside, especially commentators whose voices are reaching the people, I would just request them to love cricket, talk about cricket, and I feel a sport that is so important to a country, in which we are the… pic.twitter.com/y5cfgQ5YsT
