లాలూ ప్రసాద్ భద్రతా సిబ్బంది 9మందికి కరోనా పాజిటివ్

లాలూ ప్రసాద్ భద్రతా సిబ్బంది 9మందికి కరోనా పాజిటివ్

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భద్రత కోసం నియమించిన తొమ్మిది మంది సిబ్బందికి కరోనా సోకింది. పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో చేరారు. అయితే రిమ్స్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడంతో.. ఆయనను కెల్లీ డైరెక్టర్స్ బంగ్లాకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఆయన భద్రత కోసం 9 మంది జైలు సిబ్బందిని నియమించారు. వారందరికీ కరోనా సోకినట్లు శుక్రవారం నిర్దారణ అయింది. దాంతో వారందరినీ విధుల నుంచి రిలీవ్ చేశారు. లాలూకు భద్రతగా ఉన్న 9మందికి కరోనా సోకినట్లు రిమ్స్ సూపరింటెండెంట్ వివేక్ కశ్యప్ ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. వారి స్థానంలో వేరేవారిని నియమించాలని ఆయన కోరారు.

For More News..

యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన వలస కార్మికుని కూతురు

వీడియో: తిమింగలం మీద దూకి సముద్రంలో ఈదిన ఘనుడు

ఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి