ఆర్కే-5 అండర్ గ్రౌండ్​మైన్​ ఉత్పత్తిలో హ్యాట్రిక్​

ఆర్కే-5 అండర్ గ్రౌండ్​మైన్​ ఉత్పత్తిలో హ్యాట్రిక్​

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్​ఏరియా ఆర్కే-5 అండర్ ​గ్రౌండ్ ​బొగ్గు గని నిర్దేశిత ఉత్పత్తిని లక్ష్యాన్ని 11 రోజులు ముందుగా చేరుకుంది. 2023–-24 ఆర్థిక సంవత్సరం ఆర్కే-5 గనికి 2.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్​గా నిర్ణయించారు. గనిలో 1300 మంది కార్మికులు పనిచేస్తూ రోజుకు 726 టన్నుల ఉత్పత్తి సాధించారు. శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి పర్యవేక్షణలో ఏజెంట్​ ఏవీ రెడ్డి నేతృత్వంలో గని మేనేజర్​అబ్దుల్ ​ఖదీర్, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి మరో 10రోజులు మిగిలుండగానే 100 శాతానికి చేరుకున్నారు. గడిచిన మూడేండ్లుగా బొగ్గు ఉత్పత్తిలో వందశాతం సాధిస్తూ ఇతర గనులకు ఆర్కే5 అండర్ గ్రౌండ్​ మైన్​ ఆదర్శంగా నిలుస్తోంది. గని పనిస్థలాల్లో తక్కువ మందం థిన్​సీములు(బొగ్గు ప్రాంతం) ఉండి, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించారు. ఈ సందర్భంగా గని మేనేజర్​ఖదీర్, ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులు, సూపర్​వైజర్లను జీఎం సంజీవరెడ్డి, ఏజెంట్​ఏవీ రెడ్డి అభినందించారు.