ఆర్కే దీక్ష మూవీ టీజర్, సాంగ్స్ రిలీజ్...

ఆర్కే దీక్ష మూవీ టీజర్, సాంగ్స్ రిలీజ్...

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’.  కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌‌గా నటించారు.  తులసి, అనూష, కీర్తన,  ప్రవల్లిక, రోహిత్ శర్మ  కీలక పాత్రలు పోషించారు. జూన్ 12న సినిమా విడుదల కానుంది.  దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. 

అతిథిగా హాజరైన హీరో సుమన్ మాట్లాడుతూ ‘రామకృష్ణ గౌడ్  సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది.   వీర జవాన్ సాహసాన్ని చెప్పే పాటను థ్రిల్లింగ్‌‌గా రూపొందించారు.  

కిరణ్, అక్సా ఇద్దరూ చాలా బాగా నటించారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుతున్నా’ అని  అన్నారు.  రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘ ప్రతి మనిషిలో దీక్ష, పట్టుదల ఉంటాయి. వాటితో పనిచేస్తే ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది’ అని అన్నారు .