ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అయోధ్యను దర్శించుకున్న సీఎం యోగి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  అయోధ్యను దర్శించుకున్న సీఎం యోగి

యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో కలిసి అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఆర్ఎల్ డీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా అయోధ్యను దర్శించుకోవడం విశేషం.  అంతకుముందు ఎమ్మెల్యేలతో కలిసి యోగి ఆదిత్యానాథ్ లక్నో నుంచి బస్సులో   అయోధ్యకు వచ్చారు.  ఎమ్మెల్యేలంతా జై శ్రీరామ్ నినాదాలతో బస్సు యాత్రను ప్రారంభించారు ముందుగా వారు హనుమాన్ గర్హికీ చేరుకుని హనుమంతుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మళ్లీ లక్నోకు బయల్దేరనున్నారు.

ఫిబ్రవరి 11న అయోధ్యను సందర్శించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, స్పీకర్ సతీష్ మహానా  కొన్ని రోజుల క్రితం అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. ఆర్ఎల్డీ, బీఎస్పీ   అయోధ్య దర్శనానికి  అంగీకరించగా.. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తిరస్కరించారు.   

ALSO READ :- మంచి మెసేజ్ ఇచ్చాడు.. బురదలో ఇరుక్కుపోయిన మంత్రి

సమాజ్ వాదీ పార్టీ ఈ సమస్యను అనవసరంగ రాజకీయం చేస్తుందని బీఎస్పీ నాయకుడు ఉమాశంకర్ సింగ్ అన్నారు. తమ పార్టీ సెక్యులర్ ..అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పారు. అయోధ్యకు వెళ్లే అవకాశం రావడం  తన అదృష్టం... ఇది మతం, విశ్వాసం, చిల్లర రాజకీయాలకు అతీతమని  బీజేపీ ఎమ్మెల్యే అదితి సింగ్ అన్నారు.