
బాలానగర్, వెలుగు : ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న బావామరదలు చనిపోయారు. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో హైవేపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన హారిక (25) బెంగుళూరులో జాబ్ చేస్తోంది.
ఇటీవల ఇంటికి వచ్చిన హారిక సోమవారం తిరిగి బెంగళూరు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో సోమవారం తన అక్క భర్త, వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌రెడ్డి (35)తో కలిసి కారులో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది.
ఈ క్రమంలో రాజాపూర్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి వచ్చి రంజిత్‌రెడ్డి కారుపై పడింది. దీంతో రంజిత్‌రెడ్డితో పాటు హారిక అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.